మోక్షసంన్యాసయోగ
అథష్టాదశోఽధ్యాయః
శ్లోక 1
అర్జున ఉవాచ |
సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ||౧౮-౧||
అనువాదం
అర్జునుడు పలికెను: ఓ మహాబాహో శ్రీకృష్ణా! సన్న్యాసం మరియు త్యాగం యొక్క తత్త్వభేదాన్ని వేర్వేరుగా తెలుసుకొనదలచి ఉన్నాను. ఓ హృషీకేశా, ఓ కేశినిషూదనా! దీనిని నాకు స్పష్టంగా ఉపదేశించుము.
శ్లోక 2
శ్రీభగవానువాచ |
కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ||౧౮-౨||
అనువాదం
భగవానుడు పలికెను: కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసం అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగం అని అన్నారు.
శ్లోక 8
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||౧౮-౮||
అనువాదం
విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి, వాటిని విడిచిపెట్టటాన్ని, రజో గుణ త్యాగం అంటారు. అటువంటి త్యాగం ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు.
శ్లోక 10
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ||౧౮-౧౦||
అనువాదం
నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు (కర్మ స్వభావం గురించి).
శ్లోక 12
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్ ||౧౮-౧౨||
అనువాదం
స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా - సుఖము, దుఃఖము, మరియు ఈ రెంటి మిశ్రమము - ఈ మూడు విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ, కర్మఫల త్యాగం చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు.
శ్లోక 13
పఞ్చైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||౧౮-౧౩||
అనువాదం
ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.
శ్లోక 15
శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః |
న్యాయ్యం వా విపరీతం వా పఞ్చైతే తస్య హేతవః ||౧౮-౧౫||
అనువాదం
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు.
శ్లోక 16
తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః |
పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః ||౧౮-౧౬||
అనువాదం
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు.
శ్లోక 17
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హన్తి న నిబధ్యతే ||౧౮-౧౭||
అనువాదం
కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు.
శ్లోక 21
పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్ ||౧౮-౨౧||
అనువాదం
ఏ జ్ఞానం చేతనయితే, భిన్నభిన్న దేహంలలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానం రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.
శ్లోక 22
యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||౧౮-౨౨||
అనువాదం
సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానం, తామసిక జ్ఞానం అని చెప్పబడుతుంది.
శ్లోక 25
అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ||౧౮-౨౫||
అనువాదం
మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము, మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు.
శ్లోక 30
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ||౧౮-౩౦||
అనువాదం
ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు, బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును.
శ్లోక 33
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేన్ద్రియక్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ||౧౮-౩౩||
అనువాదం
యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు.
శ్లోక 36 మరియు 37
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||౧౮-౩౬||
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ||౧౮-౩౭||
అనువాదం
ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, దేహంయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.
శ్లోక 42
శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ||౧౮-౪౨||
అనువాదం
శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానం, విజ్ఞానం, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.
శ్లోక 43
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||౧౮-౪౩||
అనువాదం
శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్థ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.
శ్లోక 45
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |
స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణు ||౧౮-౪౫||
అనువాదం
స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ/నిర్వర్తిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము.
శ్లోక 46
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః ||౧౮-౪౬||
అనువాదం
తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి - సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో - వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.
శ్లోక 47
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||౧౮-౪౭||
అనువాదం
పర (ఇతరుల) ధర్మమును సరిగ్గా చేయుటకంటే కూడా, సరిగా చేయలేకపోయినా సరే, తన స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
శ్లోక 48
సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||౧౮-౪౮||
అనువాదం
తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదోఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
శ్లోక 50
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||౧౮-౫౦||
అనువాదం
ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని (కర్మ సన్న్యాసములో) పొందిన వ్యక్తి, ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానం యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మన్ ను కూడా ఎలా పొందగలడో - వివరిస్తాను, నా నుండి క్లుప్తముగా వినుము.
శ్లోక 51, 52, 53
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||౧౮-౫౧||
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||౧౮-౫౨||
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే ||౧౮-౫౩||
అనువాదం
వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము - లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటం).
శ్లోక 54
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాఙ్క్షతి |
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||౧౮-౫౪||
అనువాదం
పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును.
శ్లోక 59
యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||౧౮-౫౯||
అనువాదం
ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క స్వంత (క్షత్రియ) భౌతిక స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది.
శ్లోక 61
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి |
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ||౧౮-౬౧||
అనువాదం
పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
శ్లోక 65
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ||౧౮-౬౫||
అనువాదం
ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
శ్లోక 67
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ||౧౮-౬౭||
అనువాదం
ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికి, లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. (ఆధ్యాత్మిక విషయములు) వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ముఖ్యంగా, నాపట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు.
శ్లోక 73
అర్జున ఉవాచ |
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోఽస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ ||౧౮-౭౩||
అనువాదం
అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానంలో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
శ్లోక 74
సఞ్జయ ఉవాచ |
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |
సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్ ||౧౮-౭౪||
అనువాదం
సంజయుడు పలికెను: ఈ విధంగా నేను, వసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
శ్లోక 78
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ||౧౮-౭౮||
అనువాదం
ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.