మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 57
శ్లోక 57
చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ||౧౮-౫౭||
అనువాదం
నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము.