మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 25
శ్లోక 25
అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ||౧౮-౨౫||
అనువాదం
మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము, మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు.