మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 24
మోక్షసంన్యాసయోగ
శ్లోక 24
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః |
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్ ||౧౮-౨౪||
అనువాదం
స్వార్థకామన చేత ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును.