మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 38
శ్లోక 38
విషయేన్ద్రియసంయోగాద్యత్తదగ్రేఽమృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ||౧౮-౩౮||
అనువాదం
ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక (రజో గుణ) సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది.