మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 17
శ్లోక 17
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హన్తి న నిబధ్యతే ||౧౮-౧౭||
అనువాదం
కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు.