మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 64
శ్లోక 64
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ||౧౮-౬౪||
అనువాదం
నా యొక్క పరమ ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానంలో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.