మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 61
శ్లోక 61
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి |
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ||౧౮-౬౧||
అనువాదం
పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.