మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 60
శ్లోక 60
స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశోపి తత్ ||౧౮-౬౦||
అనువాదం
ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు.