మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 43
శ్లోక 43
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||౧౮-౪౩||
అనువాదం
శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్థ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.