మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 21
శ్లోక 21
పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్ ||౧౮-౨౧||
అనువాదం
ఏ జ్ఞానం చేతనయితే, భిన్నభిన్న దేహంలలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానం రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.