మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 55
శ్లోక 55
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్ ||౧౮-౫౫||
అనువాదం
కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.