విభూతియోగ
అథ దశమోఽధ్యాయః
శ్లోక 4 మరియు 5
బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ||౧౦-౪||
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః |
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ||౧౦-౫||
అనువాదం
బుద్ధి కుశలత, జ్ఞానం, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణ, సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు, భయము-ధైర్యము, అహింస, సమత్వ-బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి-అపకీర్తి మొదలగు - మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి.
శ్లోక 9
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్ |
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ||౧౦-౯||
అనువాదం
వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమునూ అనుభవిస్తుంటారు.
శ్లోక 12 మరియు 13
అర్జున ఉవాచ |
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ||౧౦-౧౨||
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ||౧౦-౧౩||
అనువాదం
అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.
శ్లోక 16
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ||౧౦-౧౬||
అనువాదం
నీవు ఏఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో, వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వరా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను? మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను, ఓ భగవంతుడా?
శ్లోక 17
కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్ |
కేషు కేషు చ భావేషు చిన్త్యోఽసి భగవన్మయా ||౧౦-౧౭||
అనువాదం
నీవు ఏఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో, వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వరా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను? మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను, ఓ భగవంతుడా?
శ్లోక 26 మరియు 27
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ||౧౦-౨౬||
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ||౧౦-౨౭||
అనువాదం
వృక్షములలో నేను రావి చెట్టును; దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను, సిద్దులలో నేను కపిల మునిని. గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన, ఉచ్చైఃశ్రవమును. భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును.
శ్లోక 28 మరియు 29
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః ||౧౦-౨౮||
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ||౧౦-౨౯||
అనువాదం
ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును. సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడను (మన్మథుడు) నేనే; సర్పములలో వాసుకిని నేను. నాగులలో నేను అనంతుడను; నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములలో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో నేను యమధర్మరాజుడను.
శ్లోక 34
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ||౧౦-౩౪||
అనువాదం
సర్వమునూ కబళించే మృత్యువును, నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తిని, సిరిసంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపకశక్తిని, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమును.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.