విభూతియోగ - శ్లోకం శ్లోక 38
శ్లోక 38
దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ||౧౦-౩౮||
అనువాదం
న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్దమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానులలో జ్ఞానంను నేనే.