విభూతియోగ - శ్లోకం శ్లోక 37
శ్లోక 37
వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాణ్డవానాం ధనఞ్జయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ||౧౦-౩౭||
అనువాదం
వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడను అని తెలుసుకొనుము మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.