విభూతియోగ - శ్లోకం శ్లోక 31
శ్లోక 31
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ||౧౦-౩౧||
అనువాదం
పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.