విభూతియోగ - శ్లోకం శ్లోక 3
శ్లోక 3
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ||౧౦-౩||
అనువాదం
నేను జన్మరహితుడను మరియు ఆది(మొదలు) లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడుతారు.