విభూతియోగ - శ్లోకం శ్లోక 14
శ్లోక 14
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః ||౧౦-౧౪||
అనువాదం
ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యదార్థ స్వరూపమును తెలుసుకోలేరు.