విభూతియోగ - శ్లోకం శ్లోక 7
శ్లోక 7
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సోఽవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ||౧౦-౭||
అనువాదం
నా మహిమలను (విభూతులను) మరియు దివ్య శక్తులను యదార్థముగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.