విభూతియోగ - శ్లోకం శ్లోక 25
శ్లోక 25
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ||౧౦-౨౫||
అనువాదం
మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన 'ఓం' కారమును. జపములలో (యజ్ఞములలో) భగవన్నామమును మరలమరల జపించటమే నేను; స్థావరములలో హిమాలయమును నేను;