జ్ఞానకర్మసన్యాసయోగ
అథ చతుర్థోధ్యాయ
శ్లోక 1
శ్రీభగవానువాచ |
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ||౪-౧||
అనువాదం
పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.
శ్లోక 3
స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||౪-౩||
అనువాదం
అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన, ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.
శ్లోక 4
అర్జున ఉవాచ |
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||౪-౪||
అనువాదం
అర్జునుడు ఇలా అన్నాడు: నీవు వివస్వానుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
శ్లోక 9
జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున ||౪-౯||
అనువాదం
నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థంచేసుకుంటారో, ఓ అర్జునా, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు, వారు నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు.
శ్లోక 10
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ||౪-౧౦||
అనువాదం
మమకారాసక్తి, భయము, మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి, ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు, మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు.
శ్లోక 15
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ||౪-౧౫||
అనువాదం
ఈ సత్యమును తెలుసుకొని, ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా, తమ కర్మలను ఆచరించారు. కాబట్టి, ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ, నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము.
శ్లోక 16
కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ||౪-౧౬||
అనువాదం
కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను, దీనిని తెలుసుకోవటం ద్వారా, నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు.
శ్లోక 18
కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ||౪-౧౮||
అనువాదం
ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేఉన్నా, వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు.
శ్లోక 19
యస్య సర్వే సమారమ్భాః కామసఙ్కల్పవర్జితాః |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పణ్డితం బుధాః ||౪-౧౯||
అనువాదం
ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేసినారో అట్టివారు, జ్ఞానోదయమైన మునులచే, పండితులు అనబడుతారు.
శ్లోక 20
త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కిఞ్చిత్కరోతి సః ||౪-౨౦||
అనువాదం
ఇటువంటి జనులు, తమ కర్మ ఫలములపై ఆసక్తి/మమకారం త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు-విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నా, వారు ఏమి చేయనట్టే.
శ్లోక 22
యదృచ్ఛాలాభసన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ||౪-౨౨||
అనువాదం
అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వంద్వములకు (సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటివి) అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధి తో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.
శ్లోక 23
గతసఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః |
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||౪-౨౩||
అనువాదం
అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని, యజ్ఞం (భగవత్ అర్పితము)గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడుతారు.
శ్లోక 24
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ||౪-౨౪||
అనువాదం
సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమైన వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.
శ్లోక 28
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ||౪-౨౮||
అనువాదం
కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.
శ్లోక 29
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ||౪-౨౯||
అనువాదం
మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు.
శ్లోక 30
అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి |
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః ||౪-౩౦||
అనువాదం
మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు.
శ్లోక 31
యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ||౪-౩౧||
అనువాదం
యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి, పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురు వంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు, ఈ లోకంలో గాని, పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు.
శ్లోక 32
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||౪-౩౨||
అనువాదం
ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది.
శ్లోక 33
శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరన్తప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||౪-౩౩||
అనువాదం
ఓ శత్రువులను లోబరుచుకొనే వాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానంనందే పరిసమాప్తమగును.
శ్లోక 34
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ||౪-౩౪||
అనువాదం
ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు.
శ్లోక 35
యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ |
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి (var అశేషాణి) ||౪-౩౫||
అనువాదం
ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జునా, నీవు మరల మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో, నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు.
శ్లోక 39
శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః |
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి ||౪-౩౯||
అనువాదం
గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారు మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.