జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 13
శ్లోక 13
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||౪-౧౩||
అనువాదం
జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.