జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 14
శ్లోక 14
న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ||౪-౧౪||
అనువాదం
కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈవిధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో చిక్కుకోరు.