జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 36
శ్లోక 36
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి ||౪-౩౬||
అనువాదం
పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు.