జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 21
శ్లోక 21
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||౪-౨౧||
అనువాదం
ఆశారహితుడై ఉండి, ఏదీ నాది అన్న భావన లేకుండా, మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవానికి, శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు.