జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 38
శ్లోక 38
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతి ||౪-౩౮||
అనువాదం
ఈ లోకంలో, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమొనర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ది సాధించిన తరువాత, కాల క్రమంలో ఈ జ్ఞానం, సాధకుని హృదయంలో పొందబడుతుంది.