జ్ఞానవిజ్ఞానయోగ
అథ సప్తమోఽధ్యాయ
శ్లోక 1
శ్రీభగవానువాచ |
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ||౭-౧||
అనువాదం
భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.
శ్లోక 5
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||౭-౫||
అనువాదం
ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి (ఆత్మ శక్తి), అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.
శ్లోక 8
రసోఽహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ||౭-౮||
అనువాదం
నీటి యందు రుచిని నేను, ఓ కుంతీ పుత్రుడా, మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర 'ఓం' కారమును (ప్రణవము); ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును.
శ్లోక 15
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ||౭-౧౫||
అనువాదం
నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు — జ్ఞానం లేని వారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్నా సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైనవారు, మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు.
శ్లోక 16
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోఽర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ||౭-౧౬||
అనువాదం
ఓ భరతశ్రేష్ఠుడా, నాలుగు రకముల ధర్మ-పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమౌతారు — ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానం నందు స్థితులై ఉన్న వారు.
శ్లోక 17
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ||౭-౧౭||
అనువాదం
వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు.
శ్లోక 18
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||౭-౧౮||
అనువాదం
నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానంతో ఉండి, దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.
శ్లోక 20
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేఽన్యదేవతాః |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ||౭-౨౦||
అనువాదం
భౌతిక ప్రాపంచిక కోరికలచేత జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు; దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు.
శ్లోక 24
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః |
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్ ||౭-౨౪||
అనువాదం
అల్పజ్ఞానులు నా అవ్యయ, పరమ స్వరూపాన్ని గ్రహించక, నేను అవ్యక్తునిగా ఉండి ఇప్పుడు వ్యక్తుడనై ప్రత్యక్షమైనానని భావిస్తారు. నా పరమమైన ఈ నాయొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు.
శ్లోక 27
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ||౭-౨౭||
అనువాదం
ఓ భరత వంశస్థుడా, రాగ, ద్వేషములనే ద్వంద్వములు, మోహము (భ్రాంతి) నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది.
శ్లోక 30
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ||౭-౩౦||
అనువాదం
సమస్త అధిభూత (పదార్థ క్షేత్రం), అధిదైవ (దేవతలు), మరియు అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.