జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 12
శ్లోక 12
యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ||౭-౧౨||
అనువాదం
భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు — సత్త్వము, రజస్సు, తమస్సు — నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను.