జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 30
శ్లోక 30
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ||౭-౩౦||
అనువాదం
సమస్త అధిభూత (పదార్థ క్షేత్రం), అధిదైవ (దేవతలు), మరియు అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.