జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 10
శ్లోక 10
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||౭-౧౦||
అనువాదం
ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.