జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 21
శ్లోక 21
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ||౭-౨౧||
అనువాదం
భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను.