జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 14
శ్లోక 14
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||౭-౧౪||
అనువాదం
ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు.