జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 8
శ్లోక 8
రసోఽహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ||౭-౮||
అనువాదం
నీటి యందు రుచిని నేను, ఓ కుంతీ పుత్రుడా, మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర 'ఓం' కారమును (ప్రణవము); ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును.