శ్రద్ధాత్రయవిభాగయోగ
అథ సప్తదశోఽధ్యాయః
శ్లోక 1
అర్జున ఉవాచ |
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ||౧౭-౧||
అనువాదం
అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించి (విస్మరించి) ఉండి, అయినా శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్త్వ గుణంలో ఉన్నట్టా లేదా రజో, తమో గుణములలో ఉన్నట్టా?
శ్లోక 2
శ్రీభగవానువాచ |
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||౧౭-౨||
అనువాదం
భగవానుడు పలికెను: ప్రతి ఒక్క మానవుడు తన సహజసిద్ధ శ్రద్ధ/విశ్వాసము తో జన్మిస్తాడు, ఇది, సాత్త్వికము, రాజసము, లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము.
శ్లోక 3
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ||౧౭-౩||
అనువాదం
అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది.
శ్లోక 5 మరియు 6
అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః |
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ||౧౭-౫||
కర్షయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః |
మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్ ||౧౭-౬||
అనువాదం
కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ దంభం(కపటత్వం) మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము.
శ్లోక 8
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ||౧౭-౮||
అనువాదం
సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు, ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.
శ్లోక 9
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ||౧౭-౯||
అనువాదం
అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగ చేస్తాయి.
శ్లోక 13
విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||౧౭-౧౩||
అనువాదం
శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును.
శ్లోక 14
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||౧౭-౧౪||
అనువాదం
పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు, మరియు పెద్దలు - వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో - అది శారీరక తపస్సు అని చెప్పబడును.
శ్లోక 20
దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే |
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||౧౭-౨౦||
అనువాదం
దానము చేయుట తన కర్తవ్యము అని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.
శ్లోక 24
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ||౧౭-౨౪||
అనువాదం
కాబట్టి, యజ్ఞములు చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు, లేదా తపస్సులు ఆచరించటంలో – వేద-విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు.
శ్లోక 26
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ||౧౭-౨౬||
అనువాదం
‘సత్’ అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ ‘సత్’ అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా ‘సత్’ అనబడుతుంది.
శ్లోక 27
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||౧౭-౨౭||
అనువాదం
‘సత్’ అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ ‘సత్’ అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా ‘సత్’ అనబడుతుంది.
శ్లోక 28
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||౧౭-౨౮||
అనువాదం
ఓ ప్రిథ పుత్రుడా, అశ్రద్దతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ, లేదా తపస్సులు కానీ, ‘అసత్’ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చవు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.