శ్రద్ధాత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 3
శ్లోక 3
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ||౧౭-౩||
అనువాదం
అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది.