శ్రద్ధాత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 11
శ్లోక 11
అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ||౧౭-౧౧||
అనువాదం
ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్త్వ గుణముతో చేయబడినట్టు.