శ్రద్ధాత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 9
శ్లోక 9
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ||౧౭-౯||
అనువాదం
అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగ చేస్తాయి.