గుణత్రయవిభాగయోగ
అథ చతుర్దశోఽధ్యాయ
శ్లోక 1
శ్రీభగవానువాచ |
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ||౧౪-౧||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్ఠమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానంను నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు.
శ్లోక 3
మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్ |
సమ్భవః సర్వభూతానాం తతో భవతి భారత ||౧౪-౩||
అనువాదం
ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
శ్లోక 4
సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ||౧౪-౪||
అనువాదం
ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
శ్లోక 5
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమ్భవాః |
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||౧౪-౫||
అనువాదం
ఓ మహా బాహువులు కల అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది - సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నశ్వర దేహంనకు బంధించును.
శ్లోక 6
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ |
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ||౧౪-౬||
అనువాదం
వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది కావుటచే, ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానం పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది.
శ్లోక 10
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ||౧౪-౧౦||
అనువాదం
ఓ అర్జునా! ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్త్వతమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; మరియు ఇంకాకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.
శ్లోక 11
సర్వద్వారేషు దేహేఽస్మిన్ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత ||౧౪-౧౧||
అనువాదం
దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానంచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), లౌకిక లాభం కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానం, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.
శ్లోక 12
లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ ||౧౪-౧౨||
అనువాదం
దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానంచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), లౌకిక లాభం కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానం, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.
శ్లోక 13
అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన ||౧౪-౧౩||
అనువాదం
దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానంచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), లౌకిక లాభం కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానం, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.
శ్లోక 14
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే ||౧౪-౧౪||
అనువాదం
సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.
శ్లోక 15
రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||౧౪-౧౫||
అనువాదం
సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.
శ్లోక 19
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి ||౧౪-౧౯||
అనువాదం
అన్ని కార్యములలోనూ, కర్తలు ఈ త్రి-గుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు, అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో, మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.
శ్లోక 21
అర్జున ఉవాచ |
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే ||౧౪-౨౧||
అనువాదం
అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?
శ్లోక 22, 23, 24, 25
శ్రీభగవానువాచ |
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ |
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాఙ్క్షతి ||౧౪-౨౨||
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తన్త ఇత్యేవం యోఽవతిష్ఠతి నేఙ్గతే ||౧౪-౨౩||
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః |
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః ||౧౪-౨౪||
మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ||౧౪-౨౫||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - (సత్త్వ గుణ జనితమైన) ప్రకాశమును కానీ, (రజో గుణ జనితమైన) కార్యకలాపములను కానీ, లేదా (తమో గుణ జనితమైన) మోహభ్రాంతిని కానీ - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు. సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు - వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతారు.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.