గుణత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 5
శ్లోక 5
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమ్భవాః |
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||౧౪-౫||
అనువాదం
ఓ మహా బాహువులు కల అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది - సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నశ్వర దేహంనకు బంధించును.