గుణత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 6
శ్లోక 6
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ |
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ||౧౪-౬||
అనువాదం
వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది కావుటచే, ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానం పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది.