కర్మసంన్యాసయోగ
అథ పంచమోధ్యాయః
శ్లోక 1
అర్జున ఉవాచ |
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ||౫-౧||
అనువాదం
అర్జునుడు అన్నాడు: ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసంను (పనులను త్యజించుట) ప్రశంసించావు మరియు కర్మ యోగమును (భక్తితో పనిచేయుట) కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?
శ్లోక 2
శ్రీభగవానువాచ |
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ||౫-౨||
అనువాదం
భగవానుడు పలికెను: కర్మ సన్యాస (పనులను త్యజించుట) మార్గము మరియు కర్మ యోగ (భక్తితో పనిచేయుట) మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగము అనేది కర్మ సన్యాసం కంటే శ్రేష్ఠమైనది.
శ్లోక 3
జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాఙ్క్షతి |
నిర్ద్వన్ద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ప్రముచ్యతే ||౫-౩||
అనువాదం
దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు.
శ్లోక 4
సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః |
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్ ||౫-౪||
అనువాదం
అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము (కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసం) మరియు కర్మ యోగము (భక్తితో పని చేయటము) భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు.
శ్లోక 5
యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ||౫-౫||
అనువాదం
కర్మ సన్యాసం ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసం మరియు కర్మ యోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు.
శ్లోక 8 మరియు 9
నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్ ||౫-౮||
ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్ ||౫-౯||
అనువాదం
కర్మ యోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు - చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, విసర్జిస్తున్నప్పుడూ, స్వీకరిస్తున్నప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ – ‘చేసేది నేను కాదు’ అన్ని ఎల్లప్పుడూ భావింతురు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు.
శ్లోక 12
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ||౫-౧౨||
అనువాదం
అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి, కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో, తమ కామముచే (కోరికలచే) ప్రేరేపింపబడి, స్వార్థ ప్రయోజనం కోసం పని చేసే వారు, కర్మ బంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.
శ్లోక 17
తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః |
గచ్ఛన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ||౫-౧౭||
అనువాదం
తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.
శ్లోక 19
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ||౫-౧౯||
అనువాదం
సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మలోనే జనన-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగిఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.
శ్లోక 20
న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ||౫-౨౦||
అనువాదం
భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి జరిగితే/లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే క్రుంగిపోరు.
శ్లోక 22
యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః ||౫-౨౨||
అనువాదం
ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు.
శ్లోక 24
యోఽన్తఃసుఖోఽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః |
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ||౫-౨౪||
అనువాదం
ఎవరైతే తమలో తాము ఆనందంగా (రమిస్తూ) ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి, అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు, భగవంతునితో ఏకమై, భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు.
శ్లోక 25
లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః |
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ||౫-౨౫||
అనువాదం
ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహంలన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమౌతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది, భగవంతుడిని పొందుతారు.
శ్లోక 26
కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ||౫-౨౬||
అనువాదం
నిరంతర ప్రయాస ద్వారా కామ-క్రోధముల నుండి బయట పడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మ-జ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహ పర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది.
శ్లోక 27 మరియు 28
స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః |
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ ||౫-౨౭||
యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః |
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ||౫-౨౮||
అనువాదం
అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి, దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రములలో లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి, ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి, కామ-క్రోధ-భయ రహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి యందే వసించును.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.