కర్మసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 29
శ్లోక 29
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి ||౫-౨౯||
అనువాదం
సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప, నా భక్తుడు శాంతిని పొందును.