కర్మసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 6
శ్లోక 6
సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి ||౫-౬||
అనువాదం
భక్తి యుక్తముగా పని చేయకుండా (కర్మ యోగము) పరిపూర్ణ కర్మ సన్యాసంను చేరుకొనుట చాలా కష్టము, ఓ గొప్ప బాహువులు కలవాడా, కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును.