కర్మసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 13
శ్లోక 13
సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ||౫-౧౩||
అనువాదం
ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.