కర్మసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 15
శ్లోక 15
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః ||౫-౧౫||
అనువాదం
సర్వాంతర్యామియైన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానంచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.