అధ్యాయం 13

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

అథ త్రయోదశోఽధ్యాయః

35 విభాగాలు
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 1

అర్జున ఉవాచ |

ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ |

ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||౧౩-౧||

అర్జున ఉవాచ

అనువాదం

అర్జునుడు పలికెను: ‘ఓ కేశవా, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి? అని తెలుసుకోగోరుచున్నాను. నిజమైన జ్ఞానం ఏమిటి మరియు అటువంటి జ్ఞానం యొక్క లక్ష్యము ఏమిటి? అని కూడా తెలుసుకోగోరుచున్నాను. ’

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 2

శ్రీభగవానువాచ |

ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే |

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||౧౩-౨||

శ్రీభగవానువాచ

అనువాదం

భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ దేహం క్షేత్రం అని, మరియు ఈ దేహంను గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 3

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |

క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ ||౧౩-౩||

అనువాదం

ఓ భరత వంశీయుడా, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రంను ఎఱింగిన వాడినే. ఈ శరీరమును క్షేత్రమని (కార్యకలాపాలు జరిగే స్థానము) మరియు ఆత్మ, పరమాత్మ క్షేత్రజ్ఞులని (క్షేత్రంనెరింగినవారు) తెలుసుకోవటమే, నిజమైన జ్ఞానంగా నేను పరిగణిస్తాను.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 4

తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |

స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ||౧౩-౪||

అనువాదం

వినుము, క్షేత్రం అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 5

ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్ |

బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||౧౩-౫||

అనువాదం

మహాత్ములైన ఋషులు క్షేత్రంను గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 6 మరియు 7

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |

ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః ||౧౩-౬||

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |

ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ||౧౩-౭||

అనువాదం

పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రం కూడి ఉన్నది. వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము — ఇవన్నీ కలిపి క్షేత్రం మరియు దాని మార్పులు (వికారములు) అనబడుతాయి.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 8, 9, 10, 11, 12

అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్ |

ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ||౧౩-౮||

ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ |

జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ||౧౩-౯||

అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు |

నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు ||౧౩-౧౦||

మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |

వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది ||౧౩-౧౧||

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |

ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోఽన్యథా ||౧౩-౧౨||

అనువాదం

నమ్రత; దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా ఉండుట; అహింస; క్షమా గుణము; సరళత; గురు సేవ; శరీర-మనస్సుల పరిశుద్ధత; నిశ్చల బుద్ధి; ఆత్మ-నిగ్రహము; ఇంద్రియభోగ వస్తువిషయములపై అనాసక్తి; అహంకారము లేకుండుట; జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; మమకారరాహిత్యం; భార్య(భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని (యావ) లేకుండా ఉండుట; జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి; ఆధ్యాత్మిక జ్ఞానంలో అచంచల విశ్వాసం; మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిటినీ నేను జ్ఞానంగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానం అని అంటాను.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 13

జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే |

అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ||౧౩-౧౩||

అనువాదం

ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో, దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను, అది తెలుసుకున్న తరువాత, వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే, సత్, అసత్ లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 14

సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్ |

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ||౧౩-౧౪||

అనువాదం

సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 15, 16, 17

సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్ |

అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||౧౩-౧౫||

బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ |

సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ||౧౩-౧౬||

అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |

భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ||౧౩-౧౭||

అనువాదం

ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే. ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైన వాడు, కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 18

జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే |

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ||౧౩-౧౮||

అనువాదం

అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే, మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానం ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 19

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః |

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ||౧౩-౧౯||

అనువాదం

ఈ ప్రకారముగా నీకు క్షేత్రం యొక్క స్వభావమును, జ్ఞానం యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 20

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |

వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్ ||౧౩-౨౦||

అనువాదం

ప్రకృతి (భౌతిక ప్రకృతి) మరియు పురుషుడు (ఆత్మలు) రెండూ కూడా అనాదియైనవి (సనాతనమైనవి). శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా, భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 21

కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే |

పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ||౧౩-౨౧||

అనువాదం

సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 22

పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్ |

కారణం గుణసఙ్గోఽస్య సదసద్యోనిజన్మసు ||౧౩-౨౨||

అనువాదం

ఎప్పుడైతే ప్రకృతిలో (భౌతిక శక్తి) లో స్థితమై ఉన్న పురుషుడు (జీవాత్మ) త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 23

ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః |

పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్పురుషః పరః ||౧౩-౨౩||

అనువాదం

దేహములోనే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, పరమ నిర్వాహకుడు మరియు పరమాత్మ, అని చెప్పబడుతాడు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 24

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ |

సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే ||౧౩-౨౪||

అనువాదం

పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యదార్థమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలాఉన్నా వారు విముక్తి చేయబడతారు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 25

ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా |

అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||౧౩-౨౫||

అనువాదం

కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు; మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానంను కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 26

అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |

తేఽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ||౧౩-౨౬||

అనువాదం

ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి ఇతరుల దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 27

యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్ |

క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ ||౧౩-౨౭||

అనువాదం

ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 28

సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్ |

వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి ||౧౩-౨౮||

అనువాదం

సమస్త ప్రాణులలో, ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 29

సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |

న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||౧౩-౨౯||

అనువాదం

సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 30

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |

యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ||౧౩-౩౦||

అనువాదం

(శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, దేహంనందున్న జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు, అని అర్థంచేసుకున్నవారు నిజముగా చూసినట్టు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 31

యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి |

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా ||౧౩-౩౧||

అనువాదం

విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానంను పొందుతారు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 32

అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః |

శరీరస్థోఽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ||౧౩-౩౨||

అనువాదం

ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహంలోనే స్థితమై ఉన్నా, అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాదు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 33

యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే |

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||౧౩-౩౩||

అనువాదం

ఆకాశము (ఖాళీ జాగా) అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహంలో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 34

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః |

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||౧౩-౩౪||

అనువాదం

ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును (చైతన్యము చే) ప్రకాశింపచేయును.

క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ

శ్లోక 35

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా |

భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్ ||౧౩-౩౫||

అనువాదం

జ్ఞాన-చక్షువులచే, ఈ క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సుపనిషత్సు బ్రహ్మవిద్యామ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవదే క్షేత్రక్షేత్రజ్ఞవైయోగ నామ త్రయోదశోఽధ్యాయః

కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.

పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.

ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి

  • అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
  • సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
  • లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
Video Generation Preview

లోతైన అనుభూతిని పొందండి

నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.