క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 32
శ్లోక 32
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః |
శరీరస్థోఽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ||౧౩-౩౨||
అనువాదం
ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహంలోనే స్థితమై ఉన్నా, అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాదు.