క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 33
శ్లోక 33
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||౧౩-౩౩||
అనువాదం
ఆకాశము (ఖాళీ జాగా) అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహంలో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.