క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 5
శ్లోక 5
ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||౧౩-౫||
అనువాదం
మహాత్ములైన ఋషులు క్షేత్రంను గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.