క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ||౧౩-౪||
అనువాదం
వినుము, క్షేత్రం అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను.